అంతా
ఒక్కటే
వేధించింది
మా అమ్మ నన్ను
పెళ్ళి చేసుకోమని
చదువు
ముగియనీ నౌకరీ
దొరకనీ ఇప్పుడు
కాదు అప్పుడు వద్దు
అని
ఎన్నో సార్లు చెప్పాను
అంతంలో ఆశొచ్చి
సరన్నాను
ఎన్నో
అమ్మాయిలను చూచాను ఎన్నో వింతలు
గాంచాను
ఒక
సుందరి అసుందరనపించింది
ఒక కోమలి మొరటుగ!
ఒక
కాంతామణి కాంతారావులా
ఉంటే మరో తనుమధ్య
హస్తిరూపిణి
ఒక
పూబోడి అచ్చం బోడిగుండులా
ఉంటే ఒక మగువ మగాడిలా!
ఒక
కన్య అనుభవస్తురాలుగా
కనిపిస్తే ఒక కామిని
కామదాహంతో!
ఒక
మదవతి మదొన్మత్తురాలైతే
ఒక తిలోత్తమ తైలముఖం!
ఒక
రంభ డంబావతైతే
ఒక ఊర్వశికి ఊరంతా
వశ్యపరిచే రూపం!
బ్రహ్మరాతయో
వేళా విశేషమో తుదకొక
సంభంధం కుదిరింది
అయ్యింది
పెళ్ళీ సింగారి
వచ్చింది, ముగిసింది
ఏడు అబ్బాయి వచ్చాడు
ముగిసాయి
ముచ్చట్లు మొదలైంది
సంసార ఈత
అగచాట్లు
అనర్గళ వాగ్వాదాలు, కంచాలు
గిన్నెల అంతరిక్ష
యాత్రలు
ఙానుల
వార్త ఙప్తికి
ఒచ్చింది, త్వరలో
పెళ్ళి చేసుకో-విశ్రాంతిగా
చింతించు.
ఈ అంధకార
జీవితంలో ఒక జ్యోతి
కనిపించింది
సింగారిని
సింహద్వారం దగ్గిరొదిలి
బాహ్య
ప్రపంచానికి వచ్చాను
అంతా రమ్యం అనిపించింది
చూరిదార్లు
కమీజులు పేంట్లు
షర్టులు మిని
మిడి మేక్సీలు
టాప్ పెట్టికోట్లు
జీంసు
బనియన్లు ఘాగ్ర
కుర్తాలు లిప్ స్టిక్లు
మస్కారాలు సం గ్లేసస్
వయస్సు
మళ్ళినా వయ్యారిలా వయస్సుకి రాకపోయినా
వనితలా
బాబ్
లు విరబోసిన కేశ
సంపదలువీరిని
చూస్తే కళ్ళు జిగేలుమన్నాయి .
మళ్ళీ
జీవితం మొదలెట్టాలి ఈ కామధేనువులని
చవిచూడాలి
నీలంగా
ఎర్రగా పసుపుగా ఏ రంగైనా అన్నీ
అమూల్య రత్నాలన్నట్టు
రూపురేఖలేమైనా
మ నో రంజకంగా వీరి సాన్నిహిత్యం
సహచర్యం
కావాలనిపించింది
ఈ మనస్సుకి మనస్సు ఒక
మర్కటమన్న మనీషుల
వార్త
ఒక
భార్య- ఒక భర్త పరంపరకి చెందినవారమన్న
సంఘ సంస్కర్తల
ఘోష
అన్నీ
కలిసి నన్ను ఆదుకొన్నాయి చలించే నా
మనస్సుని అదుపుకి
తెచ్చాయి
ఇంటికి
తిరిగి వచ్చాను గడపలో అడుగు
పెట్టాను
సింహద్వారంలో సింగారి సిగ్గుతో ప్రశ్నించింది
అమాయకంగా
స్వామీ!ఇంత
సేపైందా రావడానికి?
మేలుకొన్న
అబ్బాయి అడిగాడుఎక్కడికి
నాన్నా వెళ్ళేవు?
చెప్పడనికి
నోరు రాక ఇంట్లో
దూరాను
తిరిగి
మొదలైంది మా ఇంటి
మహాభారతం