బాలప్రపంచం
వరదొచ్చిన
గోదారిలా ఉరకలతో
పరుగెత్తే ఈ వయస్సులోఈ
భారమేమిటి?
చేతులు
కందేటట్లు కాయకష్టం
చేసి జీవించవలసిన అగత్యమేమిటి?
టీ
స్టాలుల్లో సైకిల్
షాపుల్లో పొగాకు
చుట్టేచోటులో
బండలను
పిండి చేసే పనిలో ఇలా అన్ని
చోట్లలో పనిచేసే
ఈ
బాలబాలికలు బాలకృష్ణునివలె
సర్వాంతర్యాములా?
పురిటి
గుడ్డల్లోనే కాంట్రాక్టు కివ్వబాడ్డారా ఈ భావి
పౌరులు?
ఆర్ధిక
స్తోమత లేక కుటుంబ పరిమితి తెలియక
పుట్టిన
ప్రతి పసికందుని
పనికి పంపే
ఈ
పనికిరాని మనుష్యుల
తీరు ఎప్పుడు మారుతుంది?
ఈ
బాల ప్రపంచానికి
స్వతంత్రం ఎప్పుడు దొరుకుతుంది?