దైవదర్శనం
ఇప్పుడు
సంగతి తెలిసింది
ఆల్డస్ హక్స్లీ
ఒక మహా రచయిత
అతని పుస్తకం
ఎండ్స్ ఎండ్ మీన్సు
అందులో ఉంది
నే చెప్పే సంగతి
హిందువులు
ఉపవాసంచేస్తారట
(మరి మిగిలినవారు
చెయ్యరా అని కాదు)
అప్పుడు
వారు భజిస్తారట
(ఉపవాసంతో
భజిస్తే పుణ్యమే
కదా!)
అతి భజనతో
ఆ పూజాగదిలో
సోడాగాలి
ఎక్కువ అవుతుందట
(సైన్సు క్లాసులో
చెప్పినదే!)
ఉపవాసం భజనాయాసం
సోడాగాలి
కలిసిన వాతావరణం మూలకారణమట
ఒక భక్తుడు
మైకంలో దైవస్వరూపం
చూడటానికి