మంటలు
వేసవి
వచ్చింది వ్యధలను
తెచ్చింది
మండి
పోతుంది ఎండ్, కాలిపోతుంది
కొంప
గాలికూడా భయపడిందా?కాలమే స్థంభించిందా?
జనావాసంలంతా
ఎడారుల్లా ఖాళీగుంది
వెంకయ్య
బండి మాత్రం కదలి
పోతుంది
ఎండ
మండినా బండి కదలాలి
కారనం
ఎండ మండినా ఓర్చుకోవచ్చు
రాత్రుళ్ళు
కొంచం చల్లగా ఉంటాయని
బండి
కదలి భత్యం వస్తేగాని కడుపులోని
చిచ్చు ఆరదు
ఈ మంట పెరిగేదేగాని
, తనంతట
తరగదు
కూడు
గుడ్డ అందిస్తామన్నాడు
(ప్రజా) బొజ్జనాయకుడు
ఎండనుండి
కాపాడడానికి గుడ్డ
చాలు
ఈ జఠరాగ్ని
ఆర్చడానికి కూడే
లేనప్పుడు
గుడ్డకేం
ప్రాముఖ్యత- ఎవరి
మంట వారిదే!
వేరే
జవాబు లేదు - ఉన్నది
ఒకటే జవాబు
వెంకయ్య
జీవితం మనకొక పాఠం