నిశామయీ!

 

చంద్రుని దినదినాభివృ ద్ధిని చూచి ఉప్పొంగిపోతుంది సాగరకన్య

విజృంభిస్తాడు మదోన్మత్తుడు కాని నిశామయీ నీవు విజృంభించవేం?

 

చంద్రుని చూచి లజ్జనభినయించావా?

నవ వధువువలె అదృశ్యంబయ్యావా? రవికిరణాలు చూచిన శిశిర బిందువులవలె !!

 

ప్రేమికుల మనస్సు చలింప చేసే అతివాంచనీయమైన శశి కిరణాల

సాన్నిహిత్యమే నీకు ఓర్వరానిదయ్యెనా?నీ దినార్ధ సామ్రాజ్యంలో

ఆగంతకుడై ప్రవేశించినందువలెననా?