ప్రేయసి

 

వాడు:

నీవులేని జీవితం అతి దుర్భరమనిపిస్తోంది

నిన్ను స్వప్నం లో చూచినప్పటినుంచి

తేరచాప కట్టిన పడవ రమ్యంగా పయనిస్తుందట తన గమ్యానికి

నా ఈ జీవితనౌకకి నీవు తెరచాపవై

కష్టాలని మరపించి సంతోషాన్ని ప్రసాదించు చెలీ

స్వర్గాన్ని అందించు

 

ఆమె:

సిగ్గుతో ముఖం చెంగలువయై ముకుళింప

తొలకరిజల్లు కురిసింది ఈ గుండెలో

మనస్సు ఎవో ఊహాలోకాల్లో ప్రవేశించి

వింత అనుభూతులు కోరుతుంటే

అతని రూపం నా హృదయం లో నిలిచింది

అతని కళ్ళల్లో నా రూపం చూసేను

నేటి సంధ్య ప్రథమతూరిగా

నన్ను చూచి కన్ను గీటినప్పుడు.