స్త్రీ
జీవితం
కదిలింది
బండి జరిగింది
జనం, కిటికీలో
కనబడింది విలపించే
వధువు
బదులు
చెప్పలేక కన్నీరుగార్చే, ఆత్మీయులు
బంధువులు ప్లాట్
ఫారంపై
మొదలైంది
మరో అధ్యాయం, మగువ జీవితంలో
ఒక ముఖ్యమైన కాలఘట్టం
అత్తారింటికి
బయలుదేరేటప్పుడు, విలపించని
స్త్రీ ఉందా?
ఈ
అధ్యాయం మొదలే
ఇటులైతే మరి
మిగిలిన అధ్యాయాలు? అన్నీ ఇలాంటివే!
మొదటి
అధ్యాయం - అమ్మాయి
పుట్టినప్పుడు
అయ్యో
అమ్మాయే పుట్టిందా? అన్న వ్యాఖ్యానం
రెండోది-
వయస్సుకొచ్చినప్పుడు, అయ్యో అప్పుడే
కూర్చుందా?
మూడోదే
పైన చెప్పిన సంగతి, ఇక నాల్గోది
-అమ్మాయి కనినప్పుడు
దీని
అదృష్టమే ఇంతేనన్న
కఠోర మాటలు, తుది అధ్యాయం
వితంతు అయినప్పుడు
ప్రేమానురాగాలు
(ప)పెంచుకొన్న
స్త్రీకి, జీవిత పర్యంతం
దుఖమేనా?
ఒంటరిగా
జీవించడమే విముక్తినిస్తుందా?
కాదు, ఇన్ని వ్యధలున్న-
ఒక స్వర్ణదశ ఉందీ
జీవితం లో
సుమంగళిగా
పోతే వచ్చే ప్రశంసలు
పచ్చని
సంసారం నడిపింది
మాఇంటి మహాలక్ష్మిలా
పసుపుకుంకుమతో పోయింది
పండు ముత్తైదువులా.