సాహిత్య సేవ
ఎన్నో కధలు
వ్రాసాను ఎన్నో
కవితలు వ్రాసాను
అన్నీ పత్రికలకు పంపాను అంతా
నా స్వంత కృషి
అన్నాను
పంపినవన్నీ తిరిగొచ్చాయి తమతో
ఒకే జాబు తెచ్చాయి
"ప్రచుణార్హము కాదు, అందు వలన తిరిగి
పంపబడింది" అని
నాకొక సందేహం
వచ్చింది ఈ జాబు
సంగతే సంపాదకుల
కుల మూలమంత్రమో
అని? సందేహాన్ని ఎలా తీర్చుకోవడటం?
తిరిగీ వాటిని
పంపాను మార్చి వేరే
వేరే పత్రికలకు
తుది ప్రయత్నం
పండింది ఒకానొక పత్రికలో
నా కధ పడింది
ప్రచురణ మహాత్మ్యం ఏమని చెప్పను
ఇప్పుడు నేనొక రచయితను
రచయితల సంఘం రా ష్ట్ర్రపతిని, కవులకూటం
కార్యదర్శిని
ఇదే ప్రస్తుతం
నా సాహిత్య సేవ