తల్లి బిడ్డ
కాలము స్తంభించనీ
సురులు కుర్పించే సుమన వృష్టివోలె
ఈ పద్మదళ నేత్రములు ప్రేమ కురిపింప
పాలుగారు ఈ మోము
ఆ మధురాపురవాసి ప్రతిరూపమో?
తన ఇన్న కాలుసేతులూపి స్వర్గాన్నే ఆహ్వానిస్తున్నాడా?
నీవిచ్చిన పాలు త్రాగి అమృతం పిదానమసి అని చెప్పలేక
బోసినవ్వుతో తన సంతోషం తెలిపే
ఆ పసికందు కన్నులవిందు
తన్ను మరచి ఈ లోకమును మరచి
నీ ఒడిలో నిద్రిస్తుంటే
నీవు అచ్చంగా భూదేవిలా కనిపిస్తునావు
మాట రాదు నడక రాదు
"ంగ " అన్న శబ్దంతో అందరిని వశపరిచే ఈ బంగరు బిడ్డకి
ఆ శబ్దానికి పలు అర్ధాలు కల్పించి ఆ చిన్ని ప్రతిరూపాని ప్రతి అవసరం తీర్చే
ఓ తల్లీ! నీకు జోహార్లు
ఆ చిన్నవాని చిలిపిచేష్టలు గాంచు
ఓ కరుణామయీ! నీవు ధన్యరాలువి