వసంతం

కోయిలమ్మ సుమధుర కంఠారవం

మంగళ  ధ్వానములై  పలుక

అందాలు మెరుగుదిద్దిన ఈ లోకంలో

నవ వధువై ప్రవేశిచింది వసంతం

 

అందరు వేచిఉన్నది ఈ వసంతంకోసం

చెట్లుచెమలు అందాలు పొందాయి

సుందరులైన కోమలీమణులు తమ

అందగాళ్ళ కోసంవేచిఉన్నారు

 

హృదయంలో అనంతమైన  ఆనందం

నడకలో ఉన్మాదమైన ఆతృత

రంగులు రంగరించే వసంతోత్సవం

అందరి హృదయాంతరాళాల్లో ఉండే

ఆశలకి వాంచలకి బాహ్యచిహ్నం

కాలంకలిసొచ్చింది, అందరి కోరికలు పండాలి