Hgeocities.com/Vienna/Stage/3879/padyaalu2.htmlgeocities.com/Vienna/Stage/3879/padyaalu2.htmlelayedxٍJ`xJOKtext/htmlBmoxJb.HFri, 19 May 2006 18:26:47 GMTMozilla/4.5 (compatible; HTTrack 3.0x; Windows 98)en, *ٍJxJ chandassulO padyAlu

ఛందస్సులో నా పద్యాలు

1 On the night of 'pArthiva' naraka caturdaSi 2005, sai-ji invited us to their home for 'narakAsura vadha' pArAyaNam from SrImadAndhra bhAgavatam. During the pArAyaNam, prasad-ji was murmuring from behind "mATalu nErcina manushulu" It immediately sounded like a kanda padyam. Sai-ji, Sarada-ji and myself wanted to do take it as samasyA and do the pooraNam. That's how my padya-racana started. The next day, we composed it. My toli-padyam is below.
||కం|| మాటలు నేర్చిన మనుజుడు
బూటకమే వాస్తవమని వక్కాణించున్
ఎట్లని ప్రశ్నించు కొలది
అట్లే మురిపించుకొనును నేర్పరితనమున్
2 సాయి గారి దగ్గర నేను భాగవతం, పద్యాలను చదవడం నేర్చుకొనడానికి మొదటిమారు వెళ్ళినపుడు ఆయన నాకు ఒక కాపీ ఇచ్చి దానిమీద "భావికవి భోగరాయునికి..." అని వ్రాసారు.
తొలి పద్యం వ్రాసాక మా గురువుగారిని పొగుడుతూ వ్రాయాలనిపించి ఈ విధంగా తరళం లో రెండవ పద్యాన్ని రచించాను. అంతకు ముందే "పరమ పూరుషుడాఢ్యుడొక్కడు...." అన్న తరళం పద్యం నేర్చుకున్నాను.
||త|| గురువరేణ్యుడు సాయిరాముడు "భావికవియని భోగరాయుని("
నరచతుర్దశి రాత్రమందున భాగవతమును నేర్పి చక్కగ
పూరణము సేయుటకునెంచి సమస్యనొక్కటి నాకు తెలుపగ
వరమటుంచు రచించితిని నే కందఛందోబద్ధపద్యము
3 లావణ్య కూడా తొలి సమస్యకి పూరణం ప్రయత్నించింది. తన విషయాన్ని తీసుకొని నేను మరో పూరణం చేసాను. అదే ఈ మూడో పద్యం.
||కం|| మాటలు నేర్చిన మనుజుడు
బూటకమని వాస్తవమును నిర్ధారించున్
నాటి చరిత్రపు పుటలన్
నేటికి తగవనుచు తోసె "మైథాలజి"గాన్
4 ఇంత బాగా పద్యాలు రచిస్తున్నానిపించాక మా కుటుంబం (నా తల్లిదండ్రుల, తాతల) పరిచయం చేద్దామని ఈ క్రింది పద్యం రచించాను.
|| ఆ || మాతృమూర్తియనగ మా తల్లి నాగమ్మ
రామచంద్రుడాయె మాకు తండ్రి
సుబ్బరాయుడీశ్వరుండు తాతలు మాకు
మామ్మ సోదమ్మమ్మ సూర్యకాంతం
5 మావయ్యగారికి ఈ పద్యాలు వినిపించినపుడు "చాలా బాగా చెబుతున్నావు రవి! సరస్వతి-కటాక్షం సిద్ధించింది కనుక తల్లి మీద ఒక పద్యం వ్రాయి" అన్నారు. అప్పుడు ఈ క్రింది పద్యం రచించాను.
|| ఆ || చేత వీణ( బట్టి సంగీతమును నేర్పి
పుస్తకంబు పట్టి విద్యలిచ్చి
పద్యరచనయన్న వరమొసంగితివీవు
శారదమ్మ నిన్ను చేరి కొలుతు
6 నాన్నగారికి ఈ పద్యాలు వినిపించాక అయితే మా సేల్సుమ్యాన్ కూడా బూటకములు చెప్పి పురుగుమందులు అమ్ముతాడు. ఆ విషయం మీద కూడా ఓ సమస్యా పూరణం చెయ్యి అన్నారు. అప్పుడు ఈ క్రింది విధంగా మరో సమస్యా పూరణం చేసాను :
|| కం || మాటలు నేర్చిన మనుజుడు
బూటకములు( జెప్పి పురుగుమందుల( నమ్మెన్
పట్టెడు క్రిముల( జంపక
నట్టేటను ముంచె రైతు సౌభాగ్యములన్
7 సామవేదం షణ్ముఖ శర్మ గారి "మహాభారతం - శాంతిపర్వం" పై ప్రవచనం ఇస్తూ వ్యాసుడు ఎంత ఆవేదన చెందుతూ ఈ పద్యాన్ని చెప్పాడో కదా అని వీరు ఆవేశంగా చెప్పారు:
ఊర్ధ్వబాహుర్విరోమ్యేషా నహి కశ్చిత్ శృణోతి మాం
ధర్మాదర్ధశ్చ కామశ్చ స కిమర్థం న సేవ్యతే ||
ఈ శ్లోకం విని దీన్ని తెలుగులో అనువదించాలి అనుకుని ఈ విధంగా రెండు కంద పద్యాలుగా వ్రాసాను :
|| కం || ధర్మంబగు కామంబును,
అర్ధంబును పొందవలెను అనె హితవచముల్
వ్యర్ధంబగు యత్నమ్ముల
నర్ధంబగు ఫలితమ్ములధర్మంబైనన్
|| కం || చేతుల నెత్తిని మొత్తుచు
అతిశయముగ వేదనతో వ్యాసుడు చీరెన్
ఎంతని చెప్పిరి తాతలు
ముత్తాతలు "ధర్మంబుగ మెసలంగవలెన్"
9 12/29/2005
"సవా లక్ష పన్నుల" మీద ఒక పద్యం వ్రాయమన్నారు నాన్నగారు. ఈ క్రింది పద్యం వ్రాసాను :
|| కం || తాతా నీ పళ్ళేవని
కోతులవలె ప్రశ్నించిరి ఘనముగ బుడతల్
వృత్తికి, నీటికి, రాబడి
కాస్తికి, ముప్పది రెండుకు కట్టితి పన్నుల్
10 5/12/2006

|| కం || మురళీధర నీ పిలుపును
మురిపెమ్ముగ గీతమ్మని మది నమ్మితినయ్యా!
సరళమ్ముగ బోధింపవె
పరివిధముల దివ్యగీత భగవద్గీతన్‌